Showing posts with label ప్రకాష్ కారత్. Show all posts
Showing posts with label ప్రకాష్ కారత్. Show all posts

Saturday, January 16, 2010

బసు ఆరోగ్యం మరింత విషమం

Prakash

బసు ఆరోగ్యం మరింత విషమం

కోల్‌కతా : ప్రముఖ మార్కిస్ట్‌ నాయకుడు, పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు ఆరోగ్యపరిస్థితి శనివారం తీవ్ర ఆందోళనకరంగా మారింది. ఆయన వెంటిలేటర్ల ఆధారంగానే శ్వాసపీలుస్తున్నారని బసుకు వైద్యం చేస్తున్న డాక్టర్లు చెప్పారు. ‘బసు ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. చాలావర కు వెంటిలేటర్ల సాయంతోనే శ్వాస పీల్చారు. శుక్రవారం రాత్రి ఆయన రక్తపు పోటు తగ్గింది. ఎక్కువ మోతాదులో మందులు వాడడంవల్ల రక్తపుపోటును సాధారణస్థితిలో ఉంచాం’ అని శుక్రవారం మధ్యా హ్నం విడుదల చేసిన ఎఎంఆర్‌ఐ ఆస్పత్రి వైద్య నివేదికలో పేర్కొన్నారు.

వైద్యులు శనివారం బసుకు ‘స్లో లో ఎఫిషియెన్షీ డెయిలీ డయాలిసిస్‌’ (సెల్డె) ప్రారంభించారు. ఈ ప్రత్యేక డయాలిసిస్‌ ప్రక్రియ దాదాపు ఎనిమిది గంటలు పడుతుంది’ అని ఆ నివేదిక తెలిపింది. శుక్రవారం సాయంకాలం బసుకు కొన్ని అవయవాలు ఒకేసారి పనిచేయని పరిస్థితి ఏర్పడింది. ఆయన శరీరంలో కార్బన్‌ డయాకై్సడ్‌ స్థాయి పెరగడంతో మరింత ఎక్కువసేపు వెంటిలేట ర్లు అమర్చి ఉంచామని డాక్టర్లు తెలిపారు. హృద్రో గ నిపుణుడు ఏకే మైటీ మాట్లాడుతూ - బసు గుం డె, కాలేయం పనితీరు క్షీణించాయని, మెదడులో సెన్సోరియం కూడా తక్కువ స్థాయిలో ఉందన్నారు.

బసును పరామర్శించిన ప్రధాని

అనారోగ్యంతో బాధపడుతున్న కమ్యూనిస్టు యోధుడు జ్యోతిబసును మన్మోహన్‌ శనివారం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. త్వరగా కోలుకో వాలని ఆకాక్షించారు. ‘మనం ఆయన గురించి ఆలోచిస్తాం. ఆయన కోసం ప్రార్థిస్తున్నామ’న్నారు.