













కోల్‌కతా : ప్రముఖ మార్కిస్ట్ నాయకుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు ఆరోగ్యపరిస్థితి శనివారం తీవ్ర ఆందోళనకరంగా మారింది. ఆయన వెంటిలేటర్ల ఆధారంగానే శ్వాసపీలుస్తున్నారని బసుకు వైద్యం చేస్తున్న డాక్టర్లు చెప్పారు. ‘బసు ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. చాలావర కు వెంటిలేటర్ల సాయంతోనే శ్వాస పీల్చారు. శుక్రవారం రాత్రి ఆయన రక్తపు పోటు తగ్గింది. ఎక్కువ మోతాదులో మందులు వాడడంవల్ల రక్తపుపోటును సాధారణస్థితిలో ఉంచాం’ అని శుక్రవారం మధ్యా హ్నం విడుదల చేసిన ఎఎంఆర్ఐ ఆస్పత్రి వైద్య నివేదికలో పేర్కొన్నారు.
వైద్యులు శనివారం బసుకు ‘స్లో లో ఎఫిషియెన్షీ డెయిలీ డయాలిసిస్’ (సెల్డె) ప్రారంభించారు. ఈ ప్రత్యేక డయాలిసిస్ ప్రక్రియ దాదాపు ఎనిమిది గంటలు పడుతుంది’ అని ఆ నివేదిక తెలిపింది. శుక్రవారం సాయంకాలం బసుకు కొన్ని అవయవాలు ఒకేసారి పనిచేయని పరిస్థితి ఏర్పడింది. ఆయన శరీరంలో కార్బన్ డయాకై్సడ్ స్థాయి పెరగడంతో మరింత ఎక్కువసేపు వెంటిలేట ర్లు అమర్చి ఉంచామని డాక్టర్లు తెలిపారు. హృద్రో గ నిపుణుడు ఏకే మైటీ మాట్లాడుతూ - బసు గుం డె, కాలేయం పనితీరు క్షీణించాయని, మెదడులో సెన్సోరియం కూడా తక్కువ స్థాయిలో ఉందన్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న కమ్యూనిస్టు యోధుడు జ్యోతిబసును మన్మోహన్ శనివారం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. త్వరగా కోలుకో వాలని ఆకాక్షించారు. ‘మనం ఆయన గురించి ఆలోచిస్తాం. ఆయన కోసం ప్రార్థిస్తున్నామ’న్నారు.
న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసును గురువారం ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ పరా మర్శించారు. కోల్‌కతాలోని ఏఎంఆర్ఐ ఆసుపత్రిలో చికి త్స పొందుతున్న ఆయన ఆరోగ్యపరిస్థితిపై ప్రధాని వైద్యు లను ఆరా తీశారు. న్యూమోనియాతో బాధపడుతోన్న జ్యోతిబసు ఆరోగ్యం మరింత క్షీణించి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సం గతి తెలిసిందే. ఊపిరి పీల్చడానికి కూడా కష్టపడుతోన్న ఆయనకు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రి లో వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతిబసును పరామర్శించేందుకు గురు వారం ప్రధానమంత్రి కోల్‌కతాకు చేరుకున్నారు. ప్రధాని తో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా గురువారం జ్యోతిబసును పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల వద్ద అడిగి తెలుసుకున్నారు.
కోలుకుంటోన్న జ్యోతిబసు : ఏచూరి
జ్యోతిబసు మెల్ల మెల్లగా కోలుకుంటున్నారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి తెలిపారు. న్యూమోనియాతో బాధపడుతూ కోల్‌కతాలోని ఏఎం ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జ్యోతిబసు ఆరో గ్యం క్రమంగా మెరుగవుతోందని ఏచూరి అన్నారు. వైద్యులు ఇస్తోన్న యాంటీ-బయోటిక్స్ జ్యోతిబసు అనా రోగ్యం నుంచి కోలుకునేలా చేస్తున్నాయన్నారు. ప్రస్తుతం జ్యోతిబసు ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తే బుధవారం కంటే కొంత కోలుకున్నారని ఏచూరి విలేకరులతో వెల్లడిం చారు. కానీ ఊపిరి పీల్చడానికి కష్టపడుతోన్న ఆయనకు వెంటిలేటర్ ద్వారా కృత్రిమశ్వాస అందిస్తున్నారు.