Saturday, January 16, 2010

జ్యోతిబసును పరామర్శించిన ప్రధాని

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించిన జ్యోతిబసు

manmohan-pm

జ్యోతిబసును పరామర్శించిన ప్రధాని

న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసును గురువారం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ పరా మర్శించారు. కోల్‌కతాలోని ఏఎంఆర్‌ఐ ఆసుపత్రిలో చికి త్స పొందుతున్న ఆయన ఆరోగ్యపరిస్థితిపై ప్రధాని వైద్యు లను ఆరా తీశారు. న్యూమోనియాతో బాధపడుతోన్న జ్యోతిబసు ఆరోగ్యం మరింత క్షీణించి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సం గతి తెలిసిందే. ఊపిరి పీల్చడానికి కూడా కష్టపడుతోన్న ఆయనకు స్థానిక ప్రైవేట్‌ ఆసుపత్రి లో వెంటిలేటర్‌ ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతిబసును పరామర్శించేందుకు గురు వారం ప్రధానమంత్రి కోల్‌కతాకు చేరుకున్నారు. ప్రధాని తో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ కూడా గురువారం జ్యోతిబసును పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల వద్ద అడిగి తెలుసుకున్నారు.

కోలుకుంటోన్న జ్యోతిబసు : ఏచూరి
జ్యోతిబసు మెల్ల మెల్లగా కోలుకుంటున్నారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి తెలిపారు. న్యూమోనియాతో బాధపడుతూ కోల్‌కతాలోని ఏఎం ఆర్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జ్యోతిబసు ఆరో గ్యం క్రమంగా మెరుగవుతోందని ఏచూరి అన్నారు. వైద్యులు ఇస్తోన్న యాంటీ-బయోటిక్స్‌ జ్యోతిబసు అనా రోగ్యం నుంచి కోలుకునేలా చేస్తున్నాయన్నారు. ప్రస్తుతం జ్యోతిబసు ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తే బుధవారం కంటే కొంత కోలుకున్నారని ఏచూరి విలేకరులతో వెల్లడిం చారు. కానీ ఊపిరి పీల్చడానికి కష్టపడుతోన్న ఆయనకు వెంటిలేటర్‌ ద్వారా కృత్రిమశ్వాస అందిస్తున్నారు.

No comments:

Post a Comment